క్యూబా


Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Українська Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Bahasa Melayu Slovenščina

క్యూబా గణతంత్రం (రిపబ్లిక్ ఆఫ్ క్యూబా), ఒక పెద్ద ద్వీపము 'గ్రేటర్ ఆంటిల్లెస్' మరియు కొన్నిచిన్నచిన్న ద్వీపాలు గలవు. క్యూబా ఉత్తర 'కరీబియన్' ప్రాంతంలో గలదు. ఈ ప్రాంతం కరీబియన్ సముద్రం మెక్సికో అఖాతము మరియు అట్లాంటిక్ మహాసముద్రము ల కలయికల ప్రాంతం. క్యూబా అమెరికా మరియు బహామాస్కు ఆగ్నేయ దిశలోనూ, 'టర్క్స్ మరియు కైకోస్ ద్వీపాలు, హైతీ లకు పశ్చిమాన, మెక్సికోకు తూర్పున మరియు కేమెన్ ద్వీపాలు మరియు జమైకా లకు దక్షిణాన ఉంది.దేశరాజధాని నగరం వవానా అతిపెద్ద నగరంగా కూడా ప్రత్యేకత కలిగి ఉంది. ఇతర ప్రదాన నగరాలలో శాంటిగో డీ క్యూబా మరియు కాంగువా నగరాలు ప్రధానమైనవి. కరీబియన్ ద్వీపాలలో క్యూబా అతిపెద్ద ద్వీపం ( వైశాల్యం 1,09,884 చ.కి.మీ. ) అలాగే జనసాంధ్రతలో ద్వితీయ స్థానంలో ఉంది. ప్రథమ స్థానంలో " హిస్పానియోలా ఉంది. జనసంఖ్య 11 మిలియన్లు. స్పానిష్ కాలనైజేషన్‌కు ముందు 15 వ శతాబ్ధం చివరలో క్యూబాలో అమెరిండియన్లు నివసించారు. 1898 స్పానిష్ - అమెరికన్ యుద్ధం జరిగే వరకు క్యూబా స్పానిష్ పాలనలో ఉంది. తరువాత క్యూబాకు నామమాత్ర స్వతంత్రం లభించింది. 1902 వరకు యునైటెడ్ స్టేట్స్ ప్రొటెక్టరేట్‌గా ఉంది. తాత్కాలిక రిపబ్లిక్‌గా క్యూబా 1940లో రాజ్యాంగం విధానం రూపొందించుకోవడానికి ప్రయత్నించింది.ఫుల్జెంసియొ బాటిస్టా (1952) నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా రాజకీయ తిరుగుబాటు మరియు ప్రజాందోళనలు ఉచ్ఛస్థాయికి చేరుకున్నాయి. అశాంతి మరియు అస్థిరత " క్యూబన్ తిరుగుబాటు 1959 " కి దారి తీసాయి. బాటిస్టా పదవి నుండి తొలగించబడిన తరువాత " ఫిడెల్ కాస్ట్రో " నాయకత్వంలో కొత్త ప్రభుత్వం స్థాపించబడింది. 1965 నుండి క్యూబాను " కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ క్యూబా " పాలించింది. సోవియట్ యూనియన్ మరియు యునైటెడ్ స్టేట్స్ మద్య కోల్డ్ వార్ అకారణంగా క్యూబల్ మిస్సైల్ క్రైసిస్ (1962) లో న్యూక్లియర్ యుద్ధానికి వాతావరణం సిద్ధం అయింది. మార్కిస్టు - లెనినిస్ట్ , సోషలిస్ట్ స్టేట్ గా మిగిలిన అతికొన్ని దేశాలలో క్యూబా ఒకటి. స్వతంత్ర పర్యవేక్షకులు మానవహక్కుల ఉల్లంఘన మరియు విచారణరహిత ఖైదు వంటి విషయాలను విమర్శిస్తూ ఉంటారు.క్యూబా, కరీబియన్ ప్రాంతంలో అధిక జనసాంద్రత గల దేశం. (క్యూబావో ) లేదా "గొప్ప ప్రదేశం" (కోబానా ). క్యూబా ప్రధాన ద్వీపం ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపాలలో 17వ స్థానాన్ని ఆక్రమిస్తోంది. సాంస్కృతంగా క్యూబా లాటిన్ అమెరికాలో భాగంగా భావించబడుతుంది. ఇది బహుళసంప్రదాయ కలిగిన దేశం.ఇక్కడ ప్రజలు, సంస్కృతి మరియు అలవాట్లకు ఆదిమజాతికి చెందిన టైనొ ప్రజలు మరియు సిబొనీ ప్రజలు మూలంగా ఉన్నారు. దీర్ఘకాల బానిసత్వం, ఆఫ్రికన్ బానిసల ప్రవేశం మరియు కోల్డ్ వార్ కారణంగా సోవియట్ యూనియన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలు క్యూబా సంస్కృతి మీద గణనీయమైన ప్రభావం చూపాయి.క్యూబా ఆర్థికరంగాన్ని చక్కెర, పొగాకు, కాఫీ మరియు నైపుణ్యం కలిగిన శ్రామికుల ఆధిక్యం అధికంగా ఉంది. మానవాభివృద్ధి సూచిక ఆధారంగా ఇది ఉన్నత మానవాభివృద్ధి కలిగిన దేశంగా గుర్తించబడుతుంది. మానవాభివృద్ధిలో క్యూబా ఉత్తర అమెరికాలో 8వ స్థానంలోనూ ప్రపంచంలో 67వ స్థానంలోనూ ఉంది. ఆరోగ్యసంరక్షణ మరియు విద్యాభివృద్ధిలో కూడా క్యూబా ఉన్నత స్థితిలో ఉంది. ప్రపంచంలో " వరల్డ్ ఫండ్ ఫర్ నేచుర్ " అందుకుంటున్న ఏకైకదేశంగా క్యూబా ప్రత్యేకత కలిగి ఉంది. క్యూబా వెనుజులా నుండి సహాయం అందుకుంటున్నది (2008 - 2010 మద్య 20% జి.డి.పి) ఇదే మాదిరి సహాయం సోవియట్ యూనియన్ నుండి అందుకుంది (1985-1988).

కేమాన్ దీవులు బహామాస్ Jamaica Ayiti Turks and Caicos Islands బెలిజ్ మెక్సికో హోండురాస్ డొమెనికన్ రిపబ్లిక్ నికరాగ్వా Jinotega Guatemala El Salvador పనామా British Virgin Islands Anguilla Saint Kitts and Nevis Bermuda ఆంటిగ్వా మరియు బార్బుడా కోస్టారీకా Montserrat కొలంబియా Dominica Saint Lucia Saint Vincent and the Grenadines Grenada వెనుజులా Trinidad and Tobago బార్బడోస్ ఈక్వడార్


Impressum