కాసర్‌గోడ్

Русский Français English 中文 Norsk (Bokmål) Tiếng Việt Deutsch Italiano Svenska العربية Nederlands हिन्दी తెలుగు Español

కేరళ రాష్ట్రంలోని 14 జిల్లాలలో కాసరగాడ్ జిల్లా (మలయాళం:കാസറഗോഡ് ജില്ല) ఒకటి. కాసర్‌గోడ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.1956 నవంబరు 1న ఈ జిల్లా రూపొందించబడింది. గతంలో దక్షిణ కనరా జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాకేంద్రం కాసర్‌గోడ్ పట్టణం జిల్లా పేరుగా నిర్ణయించబడింది. కాసర్‌గోడ్ జిల్లా కేరళరాష్ట్ర ఉత్తర భూభాగంలో ఉంది. జిల్లా కొబ్బరి నార, చేనేత వస్త్రాలకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. జిల్లాలో తులునాడు, కూర్గ్ వంటి ప్రముఖ పర్యాటక ఆకర్షక ప్రాంతాలు ఉన్నాయి. జిల్లాలో 29.3 కి.మీ పొడవైన సముద్రతీరం ఉంది. జిల్లాలో పర్వతశ్రేణి కూడా ఉంది. జిల్లాలో కొండలు, నదులు, గుడులు, సముద్రతీరాలు, కోటలు ఉన్నాయి. జిల్లా సంప్రదాయకంగా సుసంపన్నమై ఉంది. జిల్లాకు సప్తభాషా సంగమభూమిగా ప్రత్యేకత ఉంది. జిల్లాలో 7 ప్రధాన భాషలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. జిల్లా ఎండోసఫేట్ క్రిమిసంహారక భూమి కలిగిన జిల్లాలలో ఒకటిగా గుర్తించబడుతుంది.

Dakshina Kannada కొడగు కణ్ణూర్ (కేరళ) కోళికోడు చిక్కమగళూరు జిల్లా Udupi district వయనాడ్ జిల్లా హసన్ జిల్లా మైసూరు జిల్లా మలప్పురం


Impressum