కణ్ణూర్ (కేరళ)

Русский Français English 中文 Norsk (Bokmål) Català Deutsch Italiano Svenska العربية Nederlands हिन्दी తెలుగు Español

కేరళ రాష్ట్రంలోని 14 జిల్లాలలో కన్నూరు జిల్లా ఒకటి. కన్నూరు పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లాకు జిల్లకేంద్ర పట్టణపేరు నిర్ణయించబడింది.పాతపేరు కన్ననూరు ఆగ్లీకరణలో కన్నూరుగా రూపాంతరం అయింది. కన్నూరు జిల్లా 1957లో రూపొందించబడింది. జిల్లా ఉత్తర సరిహద్దులో కాసరగాడ్ జిల్లా, దక్షిణ సరిహద్దులో కోళికోడ్ జిల్లా మరియు ఆగ్నేయ సరిహద్దులో వయనాడు జిల్లా ఉన్నాయి. జిల్లా తూర్పు సరిహద్దులో ఉన్న పశ్చిమకనుమలు జిల్లాకు కర్నాటక రాష్ట్రానికి చెందిన కొడగు జిల్లాకు మద్య సరిహద్దు ఏర్పరుస్తూ ఉన్నాయి. కన్నూరు జిల్లా లాండ్ ఆఫ్ లూం మరియు లాండ్ ఆఫ్ లోర్ అని కూడా అంటారు. ఇక్కడ నేత పరిశ్రమలు మరియు ఆలయాలలో నిర్వహించబడే సంప్రదాయ ఉత్సవాలు పండుగలు అధికంగా ఉన్నాయి కనుక జిల్లాకు ఈపేరు వచ్చింది. జిల్లాలో ఉత్తర కేరళాలో ప్రసొద్ధమైన " తెయ్యం " అనే సంప్రదాయ నృత్యానికి కేంద్రంగా ఉంది. జిల్లాలో తెయ్యం సంబంధిత కవు అనే మందిరాలు ఉన్నాయి. కన్నురుకు 26 కి.మీ దూరంలో " కన్నూరు ఇంటర్నేషనల్ విమానాశ్రయం " నిర్మాణానికి ప్రతిపాదన జరిగింది.

కొడగు కోళికోడు కాసర్‌గోడ్ వయనాడ్ జిల్లా Dakshina Kannada మలప్పురం మైసూరు జిల్లా నీలిగిరి హసన్ జిల్లా Mandya district


Impressum