చండీగఢ్

Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Bahasa Melayu Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Українська

చండీగఢ్ (Chandigarh) ఉత్తర భారతదేశంలో ఒక నగరము మరియు కేంద్రపాలిత ప్రాంతం. చండీగఢ్ రెండు రాష్ట్రాలకు (పంజాబ్ మరియు హర్యానా) రాజధాని అయినా కాని ఆ రెంటిలో ఏ రాష్ట్రానికి చెందని కేంద్రపాలిత ప్రాంతంగా ఉండడం చండీగఢ్ ప్రత్యేకత. చండీగఢ్ (పంజాబు:ਚੰਡੀਗੜ੍ਹ) ఉత్తరభారదేశంలోని ప్రముఖనగరాలలో ఒకటి. చండీగఢ్ నగరం పంజాబు మరియు హర్యానా రాష్ట్రాలకు రాజధానిగా సేవలందిస్తుంది. భారతదేశంలో నగరనిర్మాణ ప్రణాళిక (ప్లాండ్ సిటీ) ద్వారా నిర్మించబడిన నగరాలలో చండీగఢ్ మొదటిది. ఈ నగరానికి స్విట్జర్లాండ్ నగర రూపకల్ప నిర్మాత "లె కార్‌బ్యూసియె" రూపకర్తగా పనిచేసాడు. ఈ నగర నిర్మాణం మరియు రూపకల్పన స్వాతంత్ర్యానికి ముందే జరిగింది. ఈ నగర రూపకల్పన ద్వారా లె కార్‌బ్యూసియె భవనిర్మాణానికి మరియు నగర రూపకల్పనకు అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. నగరం ప్రాథమికంగా లె కార్‌బ్యూసియె వలన రూపకల్పన చేయబడినప్పటికీ దీనికి " పిర్రే జన్నరెట్, జాన్ డ్ర్యూ మరియు మ్యాక్స్‌వెల్ ఫ్రై వంటి వారు సహకరించారు. తలసరి ఆదాయంలో చండీగఢ్ రాష్ట్రాలలో మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రధమ స్థానంలో ఉంది. 2010 లో భారతదేశంలో పరిశుభ్రమైన నగరంగా జాతీయ ప్రభుత్వ పరిశోధనల గుర్తింపు పొందింది. అలాగే చండీగఢ్ రాష్ట్రాలలో మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో " హ్యూమన్ డెవలెప్మెంట్ ఇండెక్స్ " లో కూడా ప్రథమ స్థానంలో ఉంది. చండీగఢ్ మెట్రో , పంచకుల మరియు మొహలి కలిసి త్రినగరాలుగా (ట్రై సిటీ) గా గుర్తింపు పొందింది.

పంజాబ్ Himachal Pradesh హర్యానా ఢిల్లీ Uttarakhand జమ్మూ కాశ్మీరు پنجاب सुदुर पश्चिमाञ्चल विकास क्षेत्र آزاد جموں و کشمیر وفاقی دارالحکومت


Impressum