బెంగుళూరు గ్రామీణ జిల్లా

Русский Français English 中文 Norsk (Bokmål) Tiếng Việt Català Deutsch Italiano Svenska العربية Nederlands हिन्दी తెలుగు Español

కర్నాటక రాష్ట్ర 30 జిల్లాలలో బెంగుళూరు గ్రామీణ జిల్లా ఒకటి. 1986లో బెంగుళూరు జిల్లాను విభజించి బెంగుళూరు జిల్లా, బెంగుళూరు గ్రామీణ జిల్లా రూపొందించబడ్డాయి. రాష్ట్ర రాజధాని బెంగుళూరుకు సమీపంలో ఉన్న కారణంగా ఇక్కడి నుండి బెంగుళూరుకు ఉద్యోగులు దినసరి రాకపోకలు సాగిస్తుంటారు. జిల్లా ప్రజలకు వ్యవసాయం ప్రధానంగా జీవనోపాధి కలిగిస్తున్నా సెజ్ స్థాపన తతువాత ఐ.టి రంగంలో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. బెంగుళూరు గ్రామీణ జిల్లా సమీపంలో ముద్దెనహళ్ళి, కనివెనారాయణపురం, సత్యసాయిబాబా విశ్వవిద్యాలయం, కాలేజ్ ఆఫ్ మెడిసిన్, ఇండియన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ముద్దెనహళ్ళి), విశ్వేశ్వర ఇంస్టిట్యూట్ ఆఫ్ ఆద్వాంస్డ్ టెక్నాలజీ (చిక్కబల్లపూర్), విద్యాసంస్థలు, సిల్క్ సిటీ ఉన్నాయి. 2011 గణాంకాలను అనుసరించి కర్నాటక రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా బెంగుళూరు గ్రామీణజిల్లా అత్యధిక జనసంఖ్య కలిగిన జిల్లాలలో రెండవదిగా గుర్తించబడింది. బెంగుళూరు ఇంటర్నేషనల్ సమీపంలో దేవనహళ్ళిలో దేవనహళ్ళి బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయబడి ఉంది. .2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,881,514. నగరప్రాంతం 21.65%. జనసాంధ్రత 309.చ. కి.మీ. జిల్లాలో షెడ్యూల్డ్ కుల్లాలు, షెడ్యూల్డ్ జాతుల ప్రజలు 22.5%. జిల్లాలో ప్రధానంగా హిందువులు అధికంగా ఉన్నారు. బెంగుళూరు గ్రామీణ జిల్లా ప్రధానంగా వ్యవసాయ ఆధారితమైన జిల్లా అయినప్పటికీ జిల్లాలో డెయిరీ పరిశ్రమల అభివృద్ధి, సెరికల్చర్ వంటి పరిశ్రమలఅభివృద్ధికి అవకాశాలు అధికంగా ఉన్నాయి.

బెంగుళూరు జిల్లా Ramanagara district Tumkur district చిక్కబళ్ళాపూర్ Mandya district Kolar district ధర్మపురి(తమిళనాడు) హసన్ జిల్లా మైసూరు జిల్లా చామరాజనగర్


Impressum