ఉద్దంసింగ్ నగర్

Русский Français English 中文 Norsk (Bokmål) Tiếng Việt Deutsch Italiano Svenska العربية Polski Українська Suomi Nederlands हिन्दी తెలుగు Español

ఉద్ద్ంసింగ్ నగర్ జిల్లా (హింది:ऊधम सिंह नगर ज़िला) ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జిలాలలో ఒకటి. జిల్లాకు ప్రధానకేంద్రం రుద్రాపూర్. ఇది తెహ్రీ భూభాగంలో ఉంది. ఈ జిల్లాలో బజ్పూర్, గడర్పుర్, జాస్పుర్, కాశీపూర్, కిచ్చా, ఖతిమా, సితర్గని అని 7 తాలూకాలు (తెహ్సిల్స్) ఉన్నాయి. ఈ జిల్లా తెరియా ప్రాంతంలో కుమాన్ విభాగంలో ఉంది.జిల్లా ఉత్తరదిశలో నైనీతాల్, ఆగ్నేయదిశలో చంపావత్, తూర్పు దిశలో నేపాల్ దేశం, దక్షిణ, పడమర దిశలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నాయి. 1995లో నైనీతాల్ నుండి కొంత భుభాగం తీసూని ఈ జిల్లా స్థాపించబడింది. 2011 గణాంకాలను అనుసరించి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని 13 జిల్లాలలో ఇది జనసంఖ్యలో 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానాలలో హరిద్వార్, డెహ్రాడూన్ ఉన్నాయి. వ్యవసాయ పరిశోధకులకు, ఇంజనీర్లకు గుర్తింపు పొందిన " గోవింద వల్లభ పంత్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ & టెక్నలజీ " రుద్రాపూర్‌కు 5 కి.మీ దూరంలో ఉంది.

Nainital రాంపూర్ (ఉత్తర ప్రదేశ్) మొరదాబాద్ అల్మోరా బిజ్నూర్ Bareilly Champawat అంరోహ ఘర్వాల్ భాగేశ్వర్


Impressum