అరియాలూర్

Русский Français English 中文 Norsk (Bokmål) Tiếng Việt Deutsch Italiano Svenska العربية Polski Suomi Nederlands తెలుగు Español

అరియలూరు తమిళనాడు జిల్లాలలో ఒకటి. అరియలూరులో జిల్లా ప్రధానకార్యాలయాలు ఉన్నాయి. జిల్లా వైశాల్యం 1,949.31 చదరపు కిలోమీటర్లు. అలాగే 2011 గణాంకాలను అనుసరించి జనసంఖ్య 7,52,481. 2001 జనవరి 1 ద్రావిడ మున్నేట్ర కళగం ప్రభుత్వం పెరంబలూరు జిల్లా నుండి అరియాలూరును వేరుచేసి జిల్లాగా రూపొందించబడింది. అయినప్పటికీ 2002లో మార్చి 31 లో తిరిగి ఆల్ ఇండియా అణ్ణా ద్రావిడ మున్నేట్ర కళగం ప్రభుత్వకాలంలో ఆర్ధికపరిస్థితితులను కారణం చూపుతూ దానిని తిరిగి పెరంబలూరుతో మిళితం చేయబడింది. 2007 నవంబరు 23న తిరిగి జిల్లాగా అవతరించింది. అప్పటి తమిళనాడు " రూరల్ డెవలప్మెంట్ & లోకల్ అడ్మినిస్ట్రేషన్ " మంత్రి అయిన " ఎం.కె స్టాలిన్ ఆధ్వర్యంలో అరియలూరు " ఐ.టి.ఐ ప్లేగ్రౌండ్ " లో ప్రారంభోత్సవ ఉత్సవం జరిగింది.

పెరంబలూర్ కడలూర్ తిరువారూర్ Thanjavur district తిరుచిరాపల్లి కారైక్కాల్ నాగపట్నం విళుపురం కరూర్ (తమిళనాడు) పుదుక్కొట్టై


Impressum