సంబల్పుర్

Русский Français English 中文 Norsk (Bokmål) Català Deutsch Italiano العربية Suomi Nederlands हिन्दी తెలుగు 日本語 Español

ఒడిషా రాష్ట్ర 30 జిల్లాలలో సంబల్పూర్ జిల్లా ఒకటి. చారిత్రక ప్రత్యేకత కలిగిన సంబల్పూర్ నగరం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా మహానదీ ముఖద్వారంలో ఉంది. జిల్లా వైశాల్యం 6702 చ.కి.మీ. జిల్లాలో 60% భూభాగం దట్టమైన అరణ్యాలతో నిండి ఉంది. జిల్లా తూర్పు సరిహద్దులో దేవ్‌ గర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో బర్గర్ మరుయు జర్స్‌గుడా జిల్లాలు, ఉత్తర సరిహద్దులో సుందర్ఘర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో సుందర్ఘర్, అంగూల్ జిల్లాలు ఉన్నాయి. ఒడిషా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య సంబల్పూర్ వారధిగా ఉంది. ఒకప్పుడీ జిల్లా వజ్రాలవ్యాపారానికి కేంద్రంగా ఉండేది. ప్రస్తుతం ఈ జిల్లా వస్త్రాల తయారీకి కూడా ప్రసిద్ధి చెంది ఉంది. ఈ జిల్లాలో తయారుచేయబడే " సంబల్పురి చీర "లు రాష్ట్రమంతటా ప్రత్యేకత కలిగి ఉన్నాయి. సంబల్పురి సంగీతం , సంబల్పురి నృత్యం కూడా జిల్లాకు మరికొంత ప్రత్యేకత తీసుకువసున్నాయి. జిల్లాలోని " బద్రమ అభయారణ్యం "లో అరుదైన జంతువులు సంచరిస్తూ ఉంటాయి.

జర్స్‌ర్గుడా సుందర్ఘర్ Debagarh Bargarh సుబర్నపూర్ రాయగఢ్ Anugul Baudh జష్‌పూర్ మహాసముంద్


Impressum