ఎర్నాకుళం

Русский Français English 中文 Norsk (Bokmål) Tiếng Việt Deutsch Italiano Svenska हिन्दी Nederlands తెలుగు 日本語

కేరళ రాష్ట్రంలోని 14 జిల్లాలలో ఎర్నాకుళం జిల్లా ( మళయాళం എറണാകുളം) ఒకటి. జిల్లా ఈ జిల్లా రాష్ట్రానికి మద్యభాగంలో ఉంది. జిల్లా వైశాల్యం 3,068 చ.కి.మీ. రాష్ట్రంలోని 12% ప్రజలు ఈ జిల్లాలో నివసిస్తున్నారు. ఎర్నాకుళం కేరళా వాణిజ్యకేంద్రంగా ఉంది. ఈ జిల్లా పురాతనమైన ఆలయాలు,మసీదులు, చర్చీలు ఉన్నాయి. ఈ జిల్లాలోనే కొచ్చిన్ మహానగరం ఉంది. ఈ జిల్లా నుండి రాష్ట్రానికి అత్యధిక ఆదాయం లభిస్తుంది. జనసాంధ్రతలో ఇది రాష్ట్రంలో 3వ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో మలప్పురం, తిరువనంతపురం ఉన్నాయి. ఎర్నాకుళం జిల్లా అత్యధిక సంఖ్యలో దేశీయ విదేశీ పర్యటకులకు రాష్ట్రపర్యటన సౌకర్యం కల్పిస్తుంది. కొచ్చిన్ నగరానికి సమీపంలో ఉన్న కొక్కనాడు ఈ జిల్లాకు కేంద్రంగా ఉంది. ప్రజలు అత్యధికంగా మళయాళం మాట్లాడుతుంటారు. వ్యాపార రంగంలో ఉండే ప్రజలు ఆగ్లం అత్యధికంగా అర్ధం చేసుకుంటారు. 1990లో 100% అక్షరాస్యత సాధించి దేశంలో మొదటి స్థానంలో నిలిచింది.

Thrissur Kottayam Alappuzha ఇడుక్కి పాలక్కాడు పతనమ్ తిట్ట థేని Coimbatore district మలప్పురం కొల్లం


Impressum