వెనుజులా


Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Українська Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Bahasa Melayu Slovenščina

వెనుజులా Venezuela (i/ˌvɛnəˈzweɪlə/ VEN-ə-ZWAYL-ə; Spanish pronunciation: [beneˈswela]) దక్షిణ అమెరికా లోని ఒక సుసంపన్న దేశము. అధికారికంగా " బొలివేరియన్ రిపబ్లిక్ ఆఫ్ వెనుజులా " అంటారు.ఫెడరల్ రిపబ్లిక్ అయిన ఇది దక్షిణ అమెరికా ఉత్తర సముద్రతీరంలో ఉంది.దేశానికి పశ్చిమ సరిహద్దులో కొలంబియా, దక్షిణ సరిహద్దులో బ్రెజిల్, తూర్పు సరిహద్దులో గయానా మరియు ఈశాన్య సరిహద్దులో " ట్రినిడాడ్ మరియు టొబాగో " ద్వీపం ఉన్నాయి.దేశ వైశాల్యం 916,445 kమీ² (9.86453×1012 చ .అ) జనసంఖ్య 3,17,75,371. దేశం అత్యంత అధికమైన జీవ వైవిద్యం కలిగి ఉంది. జీవవైవిధ్యంలో వెనుజులా ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది. ఈ దేశములో అపార చమురు నిల్వలు ఉన్నాయి. ఈ దేశ అతివలు తరచుగా అందాల పోటీలలో గెలుస్తుంటారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఏంజెల్స్ జలపాతము ఈ దేశములోనే ఉంది. పశ్చిమంలో ఆండెస్ పర్వతాలు, దక్షింఅంలో అమెజాన్ బేసిన్ వర్షారణ్యాల వరకు లాస్ లానోస్ మైదానాలు మరియు మద్యభూభాగంలో కరీబియన్ సముద్రతీరాలు మరియు తూర్పుభూభాగంలో ఒరినోకో డెల్టా మీదుగా మానవనివాసాలు విస్తరించి ఉన్నాయి.ప్రస్తుతం వెనుజులా అని పిలువబడే ఈ ప్రాంతం స్థానికుల వ్యతిరేకతను అధిగమించి 1522 లో స్పెయిన్ కాలనీ రాజ్యంగా ఉండేది. 1811 లో ఇది మొదటి ఫ్రెంచి అమెరికన్ కాలనీ రాజ్యం నుండి " ఫస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వెనుజులా " గా ప్రకటించబడింది. అయినప్పటికీ 1821 వరకు సురక్షిత రాజ్యంగా స్థాపించబడలేదు. అప్పటి వరకూ వెనుజులా ఫెడరల్ రిపబ్లిక్ గ్రాన్ కొలంబియాలో శాఖగా ఉంది. 1830 లో వెనుజులా ప్రత్యేకమైన పూర్తి స్వతంత్ర దేశంగా అవతరించింది. 19వ శతాబ్ధం నుండి 20వ శతాబ్ధం సగం (1958) వరకు వెనుజులా రాజకీయ అల్లర్లు మరియు నియంతృత్వ ధోరిణి మొదలైన సమస్యలను ఎదుర్కొన్నది.దేశంలో ప్రాంతీయ కౌడిల్లోస్ (సైనిక వీరులు) ఆధిఖ్యత కొనసాగింది.1958 నుండి దేశంలో డెమిక్రటిక్ ప్రభుత్వాల పాలన కొనసాగింది. 1980 మరియు 1990 లలో నెలకొన్న ఆర్ధికసంక్షోభం పలు రాజకీయ సంక్షోభాలకు దారితీసాయి.1989లో తీవ్రమైన కరకాజో తిరుగుబాటు, 1992 లో రెండు మార్లు తిరుగుబాటు ప్రయత్నాలు మరియు 1993లో ప్రభుత్వనిధులను అపహరించాడని అధ్యక్షుడు " కార్లోస్ అండ్రెస్ పెరెజ్ " కు వ్యతిరేకంగా చేసిన అభిశంశన తీర్మానం ఇందులో భాగంగా ఉన్నాయి.ప్రభుత్వం పతనం తరువాత 1998లో ఎన్నికలు నిర్వహించబడ్డాయి. 1999 లో బొలివేరియన్ విప్లవంతో వెనుజులాలో కొత్తరాజ్యాంగం రూపొందించబడింది. తరువాత దేశానికి " రిపబ్లికా బొలివేరియన్ డీ వెనుజులా " (బొలివేరియన్ రిపబ్లిక్ ఆఫ్ వెనుజులా) గా పేరు మార్పిడి జరిగింది. వెనుజులా ఒక ఫెడరల్ ప్రెసిడెంషియల్ రిపబ్లిక్. ఇందులో 23 రాష్ట్రాలు ఉన్నాయి. కాపిటల్ జిల్లాలో కారాకాస్, ఫెడరల్ డిపెండెంసీలైన ద్వీపాలు భాగంగా ఉన్నాయి.ఎస్సెక్యుబో నదికి ఉత్తరంలో ఉన్న గయానా ప్రాంతాలన్నింటినీ (1,59,500 చ.కి.మీ) వెనుజులా విలీనం చేసుకుంది. లాటిన్ అమెరికన్ దేశాలలో అధికంగా నగరీకరణ చేయబడిన దేశాలలో వెనుజులా ఒకటి. వెనుజులియన్లలో అత్యధిక ప్రజలు ఉత్తరభూభాగంలోని నగరప్రాంతాలలో నివసిస్తున్నారు. ప్రత్యేకంగా రాజధాని నగరం మరియు అతిపెద్ద వెనుజులా నగరం అయిన కారాకాస్ నగరంలో అధికంగా నివసిస్తున్నారు.

Trinidad and Tobago Grenada గయానా కొలంబియా Saint Vincent and the Grenadines Saint Lucia బార్బడోస్ Dominica సురినామ్ Montserrat ఆంటిగ్వా మరియు బార్బుడా Saint Kitts and Nevis British Virgin Islands Anguilla ఫ్రాన్స్ డొమెనికన్ రిపబ్లిక్ Ayiti పనామా Jamaica Turks and Caicos Islands కేమాన్ దీవులు పెరూ క్యూబా నికరాగ్వా బహామాస్ Jinotega కోస్టారీకా హోండురాస్ బొలీవియా El Salvador


Impressum