పుట్టపర్తి

हिन्दी 日本語 Español English Русский 한국어 Français Polski Nederlands Italiano Svenska

పుట్టపర్తి
Wikipedia

పుట్టపర్తి (ఆంగ్లం: Puttaparthi) (14°9.91′N 77°48.70′E) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లా, పుట్టపర్తి మండలం లోని గ్రామం, ఆ మండలానికి కేంద్రం.పిన్ కోడ్: 515134. ఈ పట్టణమునకు ముఖ్య ఆకర్షణ శ్రీ సత్య సాయిబాబా వారి ప్రశాంతి నిలయం ఆశ్రమము. ఈ ఆశ్రమము చూసేందుకు నిత్యం కొన్ని వేల నుంచి లక్షలలో అనేక దేశాల నుంచి భక్తులు విచ్చేస్తుంటారు. ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి ప్రశాంతి నిలయం ఆశ్రమము ముఖ్య కారణము.ఇది సమీప పట్టణమైన ధర్మవరం నుండి 42 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4368 ఇళ్లతో, 15088 జనాభాతో 4547 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 7370, ఆడవారి సంఖ్య 7718. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1896 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 587. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 595448.పిన్ కోడ్: 515 134.
Impressum