Français العربية 中文 Deutsch Español English Tiếng Việt Italiano Norsk (Bokmål) Русский Svenska
కర్ణాటక రాష్ట్ర 30 జిల్లాలలో చిక్కబళ్ళాపూర్ జిల్లా ఒకటి. చిక్కబళ్ళాపూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.2007లో కోలార్ జిల్లాలోని గౌరిబిద్నూర్, బగెపల్లి, చికబల్లపూర్, సిద్లగట్ట, చింతామణి తాలూకాలను వేరుచేసి చిక్కబళ్ళాపూర్ జిల్లా రూపొందించబడింది. నార్త్ సౌత్ సిక్స్ లైన్ జాతీయరహదారి - 7, తూర్పు - పడమర రహదారి - 58 జిల్లా గుండా పయనిస్తున్నాయి. బెంగుళూరు నుండి చిక్కబళ్ళాపూర్, దొడ్డగంజూర్, శ్రీనివాసపూర్, కోలార్ వరకు రైలు మార్గం ఉంది.