చిలకలూరిపేట

中文 Italiano Tiếng Việt English Svenska Bahasa Melayu Português

చిలకలూరిపేట ఆంధ్ర ప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన ఒక పట్టణం. గుంటూరుకు దాదాపు 40 కి మీల దూరంలో ఉంది.గుంటూరు జిల్లాలో నాలుగవ అతిపెద్ద పట్టణం. రాష్ట్రంలో ముఖ్య వ్యాపార కేంద్రంగా పేరొందిన ఈ పట్టణం జనాభా 147,179 (2001). ఈ ప్రాంతం ప్రజలు దీనిని పేట అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆంధ్ర ప్రదేశ్‌ లోని పెద్ద శాసనసభా నియోజక వర్గాలలో చిలకలూరిపేట ఒకటి. ఈ ప్రాంతంలోని 85 శాతం ప్రజలు వ్యవసాయం పై ఆధారపడ్డవారు[ఆధారం చూపాలి]. త్రికోటేశ్వర స్వామి వెలసిన కోటప్ప కొండ ఇక్కడికి 13 కి మీలే.

WikipediaImpressum