శిబ్‌సాగర్

Tiếng Việt Bahasa Melayu हिन्दी 日本語 Español English Français 中文 Svenska العربية Nederlands Italiano Català

శిబ్‌సాగర్
Wikipedia

సిబ్‌సాగర్ జిల్లా, ఎగువ అస్సాం లోని ఒక జిల్లా. అసోం రాజులు శిబ్ సాగర్ ని ముఖ్య పట్టణంగా చేసుకుని పరిపాలించారు. ఇప్పటికీ వారి కోట అయిన తలాతల్ గఢ్, రాజులు వినోదాన్ని తిలకించే "రోం గఢ్" పర్యాటకులకు ఆసక్తి కలిగిస్తూనే ఉన్నాయి. యుద్ధ సమయాలలో రాజులు తలాతల్ గఢ్ నుంచి తప్పించుకొనేందుకు రహస్యమార్గం ఉండేదిట. దీనిని శివ్‌సాగర్ అని కూడా అంటారు. జిల్లా కేంద్రంగా సిబ్‌సాగర్ పట్టణం ఉంది. భౌగోళిక వ్యత్యాసాలకు సిబ్‌సాగర్ ప్రత్యేక గుర్తింపు పొందింది. 2001 గణాంకాలను అనుసరించి జిల్లావైశాల్యం 2668 చ.కి.మీ. అస్సాం రాష్ట్ర మొత్తం వైశాల్యం 78438 చ.కి.మీ. జిల్లాలో 3 ఉప విభాగాలు ఉన్నాయి: శివ్‌సాగర్, చరైడియో, నాజిరా. 26.45°ఉ, 27.15°ఉ అక్షాంశం 94.25°తూ, 95.25°తూ రేఖాంశంలో ఉంది. శివ్‌సాగర్ జిల్లా ఉత్తర సరిహద్దులో బ్రహ్మపుత్రనది, దక్షిణ సరిహద్దులో నాగాలాండ్, తూర్పు సరిహద్దులో డిహింగ్ నది పశ్చిమ సరిహద్దులో జానీ నది ఉన్నాయి. జిల్లాలో వివిధ జాతుల, వివిధ కులాల, భాషల, సంప్రదాయాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు.




Impressum