కుప్పం శాసనసభ నియోజకవర్గం

చిత్తూరు జిల్లాలో ఉన్న 14 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటైన కుప్పం శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణాదిగా ఉన్న నియోజకవర్గం. తమిళనాడు, కర్ణాటక సరిహద్దులు కలిగిన కుప్పం నియోజకవర్గం మూడు సార్లు ముఖ్యమంత్రి అభ్యర్థిని గెలిపించి ప్రత్యేకతను చాటుకుంది. ఈ నియోజకవర్గానికి ఉన్న మరో ప్రత్యేకత రాష్ట్రంలోనే చిట్టచివరి శాసనసభ నియోజకవర్గపు సంఖ్యను కలిగి ఉండటం. 294 నియోజకవర్గాలు కలిగిన రాష్ట్రంలో ఈ నియోజకవర్గపు సంఖ్య 294. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ శాసనసభ నియోజకవర్గం మరో 6 శాసనసభ నియోజకవర్గాలతో పాటు చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.

WikipediaImpressum