దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం

మహబూబ్ నగర్ జిల్లా లోని 14 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గం కొత్తగా ఏర్పడినది. ఈ నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి. రద్దయిన అమరచింత నియోజకవర్గంలోని దేవరకద్ర (పాక్షికం), చిన్నచింతకుంట మండలాలు, గతంలో వనపర్తి నియోజకవర్గంలో భాగంగా ఉన్న అడ్డాకల్, భూత్పూర్, దేవరకద్ర (పాక్షికం) మండలాలు ఈ నియోజకవర్గంలో కలిశాయి.

WikipediaImpressum