నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం

మహబూబ్ నగర్ జిల్లా లోని 14 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ శాసనసభ నియోజకవర్గం కొత్తగా ఏర్పడినది. ఈ నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. మక్తల్ నియోజకవర్గం నుంచి నారాయణపేట మండలం, కొడంగల్ నియోజకవర్గం నుంచి దామరగిద్ద మండలం, రద్దయిన అమరచింత నియోజకవర్గం నుంచి ధన్వాడ మండలం, మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి కోయిలకొండ మండలాలు కలిపి ఈ నియోజకవర్గాన్ని ఏర్పాటుచేశారు. దీనితో డివిజన్ కేంద్రమైననూ ఈ పేరుతో నియోజకవర్గం లేని లోటు తీరింది.

Wikipedia



Impressum