మహబూబ్ నగర్ జిల్లా లోని 14 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గం 5 మండలాలు ఉన్నాయి. పునర్విభజన ఫలితంగా రద్దయిన అమరచింత నియోజకవర్గం నుంచి నర్వ, ఆత్మకూరు మండలాలు ఇందులో కలిశాయి. ఇది వరకు ఈ నియోజకవర్గంలో ఉన్న నారాయణపేట మండలం, దామరగిద్ద మండలంలోని కొన్ని గ్రామాలు కొత్తగా ఏర్పాటైన నారాయణపేట శాసనసభ నియోజకవర్గంలో కలిశాయి. ఈ శాసనసభ నియోజకవర్గం మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగం.