మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం

మహబూబ్ నగర్ జిల్లా లోని 14 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గంలో 2 మండలాలు ఉన్నాయి. పునర్విభజనకు ముందు ఉన్న కోయిలకొండ మండలం కొత్తగా ఏర్పడిన నారాయణపేట శాసనసభ నియోజకవర్గంలో కలవగా, కొత్తగా హన్వాడ మండలం ఈ నియోజకవర్గంలో భాగమైంది. పులివీరన్న, పి.చంద్రశేఖర్‌లు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొంది రాష్ట్ర మంత్రివర్గంలో పదవులు నిర్వహించారు. 2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఎన్.రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించాడు. రాజేశ్వర్ రెడ్డి మరణంతో 2012 మార్చిలో జరిగిన ఉప-ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యెన్నం శ్రీనివాసరెడ్డి విజయం సాధించాడు.

Wikipedia



Impressum