షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం

రంగారెడ్డి జిల్లా లోని శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గం 4 మండలాలు ఉన్నాయి. పునర్విభజన ఫలితంగా ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వుడ్ నుంచి తిరిగి జనరల్‌కు మారింది. జనరల్ విభాగములో ఈ నియోజకవర్గము 1967లో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఎస్.సీలకు కేటాయించబడింది. 1967 నుండి 2007 వరకు ఎస్సీలకు రిజర్వుడ్ నియోజకవర్గముగా ఉంది. గతంలో ఈ నియోజకవర్గంలో భాగంగా ఉన్న బాలానగర్, నవాబుపేట మండలంలోని గ్రామాలు పునర్వ్యవస్థీకరణ ఫలితంగా జడ్చర్ల నియోజకవర్గంలో కలిశాయి. ఈ నియోజకవర్గం నుండి పి. శంకరరావు 4 సార్లు విజయం సాధించాడు.

WikipediaImpressum