فارسی Tiếng Việt हिन्दी Español English Русский Français 中文 العربية Nederlands Deutsch Italiano Norsk (Bokmål) Català Svenska
వయనాడ్ జిల్లా, భారతదేశం కేరళ రాష్ట్రం లోని జిల్లా. 1980 నవంబరు 1న కేరళ రాష్ట్ర 12వ జిల్లాగా వయనాడు జిల్లా అవతరించింది. కోజికోడ్ జిల్లా, కణ్ణూర్ జిల్లా నుండి కొంత భూభాగం విభజించుట ద్వారా ఈ జిల్లా ఏర్పడింది. జిల్లాలో 3.79% నగరీకరణ చేయబడింది. జిల్లాలో కల్పెట్టా పురపాలక సంఘం ఒకటి మాత్రమే ఉంది.జిల్లా ప్రధాన కార్యాలయం కల్పెట్టా పురపాలక సంఘ పట్టణం.ఇది కేరళ రాష్ట్రంలో అతి తక్కువ జనాభా కలిగిన జిల్లా. కేరళలోని ఇతర జిల్లాల మాదిరిగా కాకుండా,వయనాడ్ జిల్లాలో, అదే పేరుతో ఉన్న పట్టణం లేదా గ్రామం లేదు (అంటే, "వయనాడ్ అనే పట్టణం" లేదు).2018 గణాంకాల నివేదిక ప్రకారం, వాయనాడ్ జిల్లా జనాభా 8,46,637,ఇది కొమొరోస్ దేశం లోని జనాభాకు దాదాపు సమానం.