हिन्दी Nederlands Português Tiếng Việt English Italiano Bahasa Melayu 中文
ధవళేశ్వరం, తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం గ్రామీణ మండలానికి చెందిన జనగణన పట్టణం. ఈ పట్టణం రాజమహేంద్రవరం పట్టణానికి తూర్పు వైపు ఉంది. ధవళేశ్వరం రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ (GRMC)లో ఒక భాగం.ఇది గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలో భాగంగా కూడా ఉంది. ఈ పట్టణం చివరిలో ఆర్ఠర్ కాటన్ నిర్మించిన ధవళేశ్వరం ఆనకట్ట ఉంది. ఇది కాటన్ గోదావరి నది పై నిర్మించిన నాలుగు ఆనకట్టలలో మొదటిది. దీనిని దాటి వెళ్తే బొబ్బర్లంక, మద్దూర్లంక, విజ్జేశ్వరం అనకట్టలు వస్తాయి. ఈ ఆర్థర్ కాటన్ నిర్మించిన ఆనకట్టలని భారతప్రభుత్వం 1982 సంవత్సరంలో ఆధునికీకరించింది. గోదావరి నది నీటి పారుదల శాఖకు ఇది ముఖ్య కేంద్రం.