Українська हिन्दी Português Español English Русский Română Français Polski ไทย Nederlands Deutsch Italiano
మీనాక్షి అమ్మవారి ఆలయం తమిళనాడులోని మదురై పట్టణంలో ఉంది. ఈ దేవాలయం కల వేగాయి నది ఒడ్డున ఉంది. మదురై పట్టణం తమిళనాడులో రెండవ పెద్ద పట్టణం. తమిళనాడు రాష్ట్ర సంస్కృతి, కళలు, సాంప్రదాయ వారసత్వాలు మొదలైనవాటికి నిలయంగా ఉంటుంది. ప్రపంచంలోని అతి పురాతన నగరాలలో ఒకటైన మదురై అనేక రాజ వంశాల పాలనలు చూసింది. చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు, బ్రిటిష్ పాలకులు ఎంతో మంది ఈ నగరాన్ని అభివృద్ధి పరచారు. అనేక స్మారకాలు, దేవాలయాలు. భారతదేశ సంస్కృతి, కళలు, ఆధ్యాత్మికతలలో ప్రధాన పాత్ర వహించే నగరాలలో మదురై పట్టణం ఒకటి. 2500 ఏళ్ల క్రితమే సుందరేశ్వర్ ఆలయం (మీనాక్షి అమ్మవారి ఆలయం) నిర్మించారని చారిత్రక ఆనవాళ్లు తెలుపుతున్నాయి. ఈ గుడి ఆ కాలపు జీవనవిధానాన్ని ప్రతిబింబిస్తుంది. అద్భుతమైన శిల్ప, చిత్ర కళారీతులతో ఉన్న ఈ దేవాలయం తమిళ సంస్కృతికి చిహ్నం. దీని గురించి తమిళ సాహిత్యంలో పురాతన కాలం నుంచి ప్రస్తావిస్తున్నారు.