చిత్తూరు జిల్లా

Suomi Deutsch فارسی Tiếng Việt हिन्दी 日本語 Português Español English Русский Français 中文 Polski Dansk Svenska العربية Italiano Norsk (Bokmål)

చిత్తూరు, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక నగరం, జిల్లాకేంద్రం. చిత్తూరు జిల్లా రాయలసీమలో ఒక భాగం. చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్‌కు దక్షిణాన తమిళనాడు సరిహద్దులలో ఉంది. చిత్తూరుకు పశ్చిమాన తమిళనాడుకు చెందిన జిల్లాలు ఆర్కాట్, ధర్మపురి, కర్ణాటకకు చెందిన కోలార్ జిల్లా, తూర్పున తమిళనాడుకు చెందిన అణ్ణా, చెంగై జిల్లాలు, ఉత్తరాన వైఎస్ఆర్ జిల్లా, అనంతపురం జిల్లాల మధ్య ఉంది. జిల్లాను రెండు సహజ విభాగాలుగా విభజించ వచ్చు. ఒకటి కొండలు లోయలతో కూడిన మదనపల్లి విభాగం, రెండవది మైదాన ప్రాంత మండలాలతో కూడిన పుత్తూరు విభాగం.తిరుపతి, కాణిపాకం, శ్రీ కాళహస్తి దేవాలయాలకు ప్రసిద్ధి. ఇది ధాన్యములు, చెరకు, మామిడి, వేరుశనగలకు వ్యాపార కేంద్రము. ఇక్కడ నూనె గింజలు, బియ్యం మిల్లింగ్‌ పరిశ్రమలు ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ మండలాలు, గ్రామాలు గలిగిన జిల్లా చిత్తూరు జిల్లా. Map

WikipediaImpressum