బ్రెజిల్

Suomi فارسی Tiếng Việt עברית Galego Magyar Nederlands 한국어 Српски / Srpski Norsk (Bokmål) Bahasa Melayu Português العربية Română Français Euskara Català Eesti Svenska 日本語 Nynorsk Español Slovenčina Lietuvių 中文 Dansk ไทย Deutsch Italiano Hrvatski Polski हिन्दी English Русский Ελληνικά Slovenščina Čeština Українська Türkçe

బ్రెజిల్
Wikipedia

బ్రెజిల్ అధికార నామం " ఫెడరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్ ". దక్షిణ అమెరికా దేశాలలో అతి పెద్ద దేశం. వైశాల్యం రీత్యా ప్రపంచములోనే ఐదవ అతిపెద్ద దేశమైన బ్రెజిల దక్షిణ అమెరికా భూభాగంలో దాదాపు సగం విస్తీర్ణాన్ని కైలిగి ఉంటుంది. జనాభా లెక్కల రీత్యా కూడా ప్రపంచములోనే ఆరవ అతిపెద్ద దేశమైన బ్రెజిల్ నాల్గవ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉంది. పూర్చిగీసు భాషను అధికార భాషగా కలిగిన అతిపెద్ద దేశంగా ప్రత్యేకత కలిగి ఉంది. తూర్పు సరిహద్దులో అట్లాంటిక్ మహాసముద్రం ఉన్న బ్రెజిల్ సముద్ర తీరం పొడవు 7,491 కిలోమీటర్ల కంటే అధికంగా ఉంది.దేశసరిహద్దులో ఈక్వడార్ మరియు చిలీ మినహా మిగిలిన అన్ని దేశాలు ఉన్నాయి.దక్షిణ అమెరికా ఖండంలో 45.3% భూభాగం ఆక్రమించుకుని ఉంది. బ్రెజిల్ లోని అమెజాన్ నదీముఖద్వారంలో విస్తారమైన ఉష్ణమండల అరణ్యాలు విస్తరించి ఉన్నాయి.వైవిధ్యమైన పర్యావరణం, విస్తారమైన జంతుజాలం, విస్తారమైన సహజ వనరులకు మరియు అభయారణ్యాలకు ఇది నిలయంగా ఉంది. అసమానమైన పర్యావరణం బ్రెజిల్‌ను 17 మహావైవిధ్యభరితమైన దేశాలలో ఒకటిగా చేసింది. పర్యావరణ పరిరక్షణ మరియు అరణ్యాల నిర్మూలన వంటి చర్చలకు బ్రెజిల్ కేంద్రంగా ఉంది.




Impressum