తిరుత్తణి

हिन्दी Nederlands Tiếng Việt Deutsch English Italiano Bahasa Melayu Norsk (Bokmål) 中文 Svenska

తిరుత్తణి
Wikipedia

తిరుత్తణి (Tiruttani) తమిళనాడులో గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దైవం సుబ్రహ్మణ్య స్వామి. కొండపై ఉన్న ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది. ఈ దివ్య క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వల్లీ దేవసేన అమ్మవార్ల సహితంగా కొలువయ్యారు. తమిళనాడులోని సుబ్రహ్మణ్య క్షేత్రాలలో విశిష్టమైనదిగా పేరుగాంచిన ఈ క్షేత్రం తమిళులందరికీ ఆరాధ్య క్షేత్రం. తమిళుల ఇష్టదైవంగా, ఇలవేల్పుగా పూజలందుకుంటున్న సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఇక్కడ మురుగపెరుమాళ్ళుగా పూజలందుకుంటున్నాడు. శ్రీవారు వెలసి ఉన్న కొండకు ఇరుప్రక్కలందూ పర్వత శ్రేణులు వ్యాపించి ఉన్నాయి. ఉత్తరాన గల పర్వతం కొంచెం తెల్లగా ఉండడంవల్ల దీనిని ‘బియ్యపుకొండ’ అని పిలుస్తారు. దక్షిణం వైపునగల కొండ కొంచెం నల్లగా ఉండడంవల్ల దానిని ‘గానుగ పిండి కొండ’ అని పిలవడం జరుగుతోంది. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవతలు, మునుల బాధలు పోగొట్టడానికి శూరపద్మునితో యుద్ధం చేసిన అనంతరం, వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయకుల రాజులతో చేసి చిన్నపోరు ముగిసిన అనంతరం శాంతించి, ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువయ్యాడని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. స్వామి శాంతించి ఇక్కడ కొలువయ్యాడు కనుక ఈ క్షేత్రానికి ‘తణిగై’ లేదా ‘శాంతిపురి’ అనే పేరొచ్చింది. అలాగే ‘తణిగ’ అనే పదానికి మన్నించుట, లేదా ఓదార్చుట అని అర్థం చెబుతారు. స్వామి భక్తుల తప్పులను, పాపాలను మన్నించి, కటాక్షిస్తాడు కనుక ఈ క్షేత్రానికి తిరుత్తణి అని పేరు వచ్చింది.




Impressum