కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం

మహబూబ్ నగర్ జిల్లా లోని 14 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గం 5 మండలాలు ఉన్నాయి. పునర్విభజన ఫలితంగా ఇది వరకు ఈ నియోజకవర్గంలో ఉన్న మిడ్జిల్ మండలం జడ్చర్ల నియోజకవర్గంలో కలిసింది. అచ్చంపేట నియోజకవర్గంలోని కల్వకుర్తి మండలానికి చెందిన 14 గ్రామాలు ప్రస్తుతం ఇందులో కలియడంతో కల్వకుర్తి మండలం పూర్తిస్థాయిలో ఈ నియోజకవర్గంలో భాగమైంది. 1989లో ఇక్కడి నుండి పోటీ చేసిన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిత్తరంజన్ దాస్ చేతిలో పరాజయం పొందడంతో అప్పుడు ఈ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Wikipedia



Impressum