కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం

కొడంగల్ శాసనసభ నియోజకవర్గం. నారాయణపేట, వికారాబాద్ జిల్లాల పరిధిలో ఉంది.2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ శాసనసభ నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి. ఈ శాసనసభ నియోజక వర్గం మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగం. పునర్విభజనకు పూర్వం అసంపూర్తిగా ఉన్న మద్దూరు మండలం ప్రస్తుతం పూర్తిగా ఈ నియోజకవర్గంలో చేరగా, ఇదివరకు ఈ నియోజకవర్గంలో ఉన్న దామరగిద్ద మండలం కొత్తగా ఏర్పాటైన నారాయణపేట శాసనసభ నియోజకవర్గంలో కలిసింది.

WikipediaImpressum