మహబూబ్ నగర్ జిల్లా లోని 14 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గం 5 మండలాలు ఉన్నాయి. పునర్విభజన ఫలితంగా ఇదివరకు నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో భాగంగా ఉన్న కొన్ని గ్రామాలు కూడా ఇప్పుడు ఈ నియోజకవర్గంలో కలిశాయి. 1952 నుండి ఇప్పటివరకు 12 సార్లు ఎన్నికలు జరుగగా కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 7 సార్లు విజయం సాధించగా, 3 సార్లు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందినారు. తెలుగుదేశం పార్టీ, కమ్యూనిష్ఠులు ఒక్కోసారి విజయం పొందినాయి.