గంగదేవిపల్లి

గంగదేవిపల్లి, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ గ్రామీణ జిల్లా, గీసుకొండ మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.ఈ గ్రామం ఒకప్పుడు మచ్చాపూర్ గ్రామ పంచాయతి పరిధిలో ఉండేది.1994, సెప్టెంబరులో మచ్చాపూర్ నుంచి విడదీసి దీనిని ప్రత్యేక గ్రామ పంచాయతిగా ప్రకటించారు. ఆనాటి నుంచి గ్రామస్థులంతా సంఘటితమై సమష్టి కృషితో గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషిచేయనారంభించారు. దాని ఫలితమే 2007లో ఈ గ్రామం నిర్మల్ జాతీయ పురస్కారం అవార్డు పొందినది. 1995, 2001లలో జరిగిన గ్రామ పంచాయతి ఎన్నికలలో సర్పంచుతో సహా వార్డు సభ్యులందరూ మహిళలే కావడం ప్రత్యేకత. ఇటీవలి కాలంలో అక్కడి విశేషాలు తెలుసుకోవడానికి అనేక రాజకీయ పార్టీల అధినేతలు ఈ ఆదర్శ గ్రామాన్ని పర్యటించించడంతో రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ ఈ గ్రామం ప్రముఖంగా వార్తల్లోకి వచ్చింది.

WikipediaImpressum