గిద్దలూరు శాసనసభ నియోజకవర్గం

గిద్దలూరు శాసనసభ నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఉంది. 1955లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా గిద్దలూరు, కొమరోలు, రాచర్ల, బేస్తవారిపేటలో కొంత భాగంతో గిద్దలూరు నియోజకవర్గంగా ఏర్పడింది. గిద్దలూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు ఒక ఉప ఎన్నికతో సహా మొత్తం 13 సార్లు ఎన్నికలు జరిగాయి. 1967 ఎన్నికల వరకు కర్నూలు జిల్లాలో ఉన్న గిద్దలూరు నియోజకవర్గం 1970లో ప్రకాశం జిల్లా ఏర్పడిన తర్వాత అందులో భాగమైంది. నియోజకవర్గంలో కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ (ఐ) లు కలిసి నాలుగుసార్లు గెలవగా, స్వతంత్ర అభ్యర్థులు మూడుసార్లు, తెలుగుదేశం నాలుగు సార్లు, జనతాపార్టీ, ప్రజారాజ్యం పార్టీలు చెరోసారి గెలుపొందాయి. ఈ నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా పిడతల కుటుంబీకులే మొదటి నుండి గెలుస్తూ ఉండటం విశేషం. ప్రకాశం జిల్లాలో కెళ్ళా అభివృద్ధిలో బాగా వెనుకబడిన ఈ నియోజకవర్గంలో రాయలసీమ ప్రభావం ఎక్కువ.

Wikipedia



Impressum