చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం

ఆదిలాబాదు జిల్లాలోని 10 శాసనసభ (శాసనసభ) నియోజకవర్గాలలో చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం ఒకటి. తూర్పు ఆదిలాబాదు భాగంలో కల ఈ నియోజకవర్గం జిల్లా రాజకీయాలలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. ఇక్కడ నుండి విజయం సాధించిన ఇద్దరు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా పొందినారు. తెలుగుదేశం పార్టీకి చెందిన బోడ జనార్థన్ ఇక్కడ నుండి వరుసగా 4 సార్లు గెలుపొందినాడు. 2004లో వరుసగా ఐదవసారి బరిలోకి దిగి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జి.వెంకటస్వామి కుమారుడు జి.వినోద్ చేతిలో ఓడిపోయాడు. మరో ఆరు శాసనసభ నియోజకవర్గలతో పాటు పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉన్న ఈ నియోజకవర్గం 2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. ఈ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 1,48,412.

WikipediaImpressum