జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం

మహబూబ్ నగర్ జిల్లా లోని 14 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. పునర్వవస్థీకరణ ఫలితంగా ఇదివరకు షాద్‌నగర్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్న బాలానగర్, నవాబ్‌పేట మండలాలు ఈ నియోజకవర్గంలో కలవగా, ఇక్కడి నుంచి తిమ్మాజీపేట మండలం నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి తరలించబడింది. ఈ నియోజకవర్గం మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగం. 1961లో ఏర్పడిన ఈ నియోజకవర్గం నుంచి 5 సార్లు తెలుగుదేశం పార్టీ విజయం సాధించగా, 4 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందినది. ఇక్కడి నుండి 3 సార్లు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందినారు. 2004 ఎన్నికలలో కాంగ్రెస్ మద్దతుతో తెలంగాణ రాష్ట్ర సమితి గెలిచింది. 2008 ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించగా, 2009 శాసనసభ ఎన్నికలలో ఈ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందినాడు.

Wikipedia



Impressum