దక్షిణ కన్నడ మునుపు దక్షిణ కనర అని పిలువబడింది. కర్ణాటక రాష్ట్రంలో ఇది సముద్రతీర జిల్లాలలో ఒకటిగా ఉంది. ఇది పశ్చిమ కనుమలలో తూర్పుదిశలో ఉన్నాయి.
జిల్లా సరిహద్దులో అరేబియా సముద్రపు నీలజలాలు ఉన్నాయి. అందమైన పర్వతశ్రేణి, ఆలయ పట్టణాలు, సంపన్నమైన సంస్కృతి సమ్మిశ్రితం ఈ జిల్లాను అభిమాన పర్యాటక గమ్యంగా మార్చింది. మంగుళూరు నగరం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 4,866. జనసాంధ్రత 430.జిల్లాలో 354 గ్రామాలు ఉన్నాయి.