మహబూబ్ నగర్ జిల్లా లోని 14 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గం 5 మండలాలు ఉన్నాయి. పునర్విభజన ఫలితంగా జడ్చర్ల నియోజకవర్గంలోని తిమ్మాజీపేట మండలం ఈ నియోజకవర్గంలో భాగం కాగా, ఇది వరకు ఉన్న గోపాలపేట మండలం వనపర్తి నియోజకవర్గానికి తరలించబడింది.