నల్లమల అడవులు

Português Deutsch English Català Svenska

నల్లమల అడవులు
Wikipedia

నల్లమల (ఆంగ్లం : The Nallamala) (సాహిత్యపరంగా."నల్ల కొండలు") (ఇంకనూ; నల్లమల శ్రేణి).గుంటూరు జిల్లాలోని గుతికొండలో నల్లమల అడవులు పుట్టాయి. ఇవి తూర్పు కనుమలలో ఒక భాగం. ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్ లోని ఐదుజిల్లాలలో (కర్నూలు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, కడప జిల్లా) ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. ఇవి కృష్ణా నది, పెన్నా నదులకు మధ్యన ఉత్తర-దక్షిణ దిశగా దాదాపు 150 కి.మీ. వరకు విస్తరించి యున్నవి. ఈ ప్రాంతానికి నల్లమల అడవులు అని వ్యవహరిస్తారు. ఈ కొండల శ్రేణికి నల్లమల కొండలు అని పిలుస్తారు. వీటి సగటు ఎత్తు 520 మీటర్లు. భైరానీ కొండ ఎత్తు 929 మీటర్లు, గుండ్లబ్రహ్మేశ్వరం వద్ద ఈ కొండల ఎత్తు 903 మీటర్లు.. ఈ రెండు శిఖరాలూ కంభం పట్టణానికి వాయువ్య దిశన గలవు. ఇంకనూ అనేక శిఖరాలు 800 మీటర్ల ఎత్తు గలవి.. నల్లమల మధ్యభాగంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాతంలో పులుల అభయారణ్యం ఉంది. దీనికే రాజీవ్ అభయారణ్యం అని పేరు. ఇది దేశంలోని 19 పులుల సంరక్షణ కేంద్రాలలో ఒకటి.




Impressum