ఉస్మానాబాద్ మహారాష్ట్ర రాష్ట్రంలోని ఉస్మానాబాద్ జిల్లా ముఖ్యపట్టణం. జిల్లాలోని తుల్జాపూర్ లో కల తుల్జాభవానీ మాత భారతదేశమంతటా ప్రసిద్ధి చెందింది. జిల్లా విస్తీర్ణం 7512.4 చదరపు కి.మీలు అందులో 241.4 చ.కి.మీల మేరకు పట్టణప్రాంతాలు ఉన్నాయి. 2001 జనగణన ప్రకారం జిల్లా మొత్తం జనాభా 14,86,586. అందులో 15.69% పట్టణాలలో నివసిస్తున్నారు