సాతారా, మహారాష్ట్రలోని సాతారా జిల్లా ముఖ్యపట్టణం. ఇది కృష్ణా నది, వెన్నా నదుల సంగమం వద్ద ఉంది. ఈ నగరాన్ని 16 వ శతాబ్దంలో స్థాపించారు. ఇది ఛత్రపతి షాహుజీ-1 కి రాజధానిగా ఉండేది. ఏడు (సాత్) దుర్గాల (తారా) నగరంగా దీనికి ఈ పేరు వచ్చింది.