ఇది వనపర్తి జిల్లాకు చెందిన శాసనసభ నియోజకవరం. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గం 5 మండలాలు ఉన్నాయి. పునర్విభజనలో భాగంగా నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి గోపాల్‌పేట మండలం, ఆలంపూర్ నియోజకవర్గం నుంచి పెబ్బేరు మండలాలు కొత్తగా ఈ నియోజకవర్గంలో వచ్చిచేరాయి. గతంలో పాక్షికంగా ఉన్న అడ్డాకల్, భూత్పూర్, దేవరకద్ర మండలాలు కొత్తగా ఏర్పడిన దేవరకద్ర నియోజకవర్గంకు తరలించారు. ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లెల చిన్నారెడ్డి గెలుపొందినాడు. ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ప్రముఖస్థానం సంపాదించిన సురవరం ప్రతాపరెడ్డి 1952లో ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించాడు.