రాజమండ్రి

Suomi فارسی Tiếng Việt Bahasa Melayu हिन्दी 日本語 English Русский Français 中文 Polski Magyar Svenska Deutsch Српски / Srpski Italiano Català

రాజమండ్రి
Wikipedia

రాజమహేంద్రవరం (పేరు మారకముందు‌‌:రాజమండ్రి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక నగరం.గోదావరినది పాపి కొండలు దాటిన తరువాత ఇక్కడే విస్తరించి మైదానంలో ప్రవేశించి కొద్ది మైళ్ళు దిగువన ఉన్న ధవళేశ్వరం దగ్గర చీలి డెల్టాగా మారుతుంది. గోదావరితీరాన్న ఉంది కనుక ఇది పుణ్య క్షేత్రం. రాజమహేంద్రవరానికి విశిష్ట ప్రాముఖ్యత ఉంది. రాజరాజనరేంద్రుడు ఇక్కడ నుండే రాజ్యమేలేడు కనుక ఇది చారిత్రక స్థలం. రాజమహేంద్రవరం ఆర్థిక, సాంఘిక, చారిత్రక, రాజకీయ ప్రాముఖ్యత కలిగిన నగరం. అందువలన ఈ నగరాన్ని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని అని కూడా అంటారు. రాజమహేంద్రవరాన్ని రాజమండ్రి, రాజమహేంద్రి అని కూడా వ్యవహరిస్తారు. గోదావరి నది పాపి కొండలు దాటిన తరువాత పోలవరం వద్ద మైదాన ప్రాంతంలో ప్రవేశించి, విస్తరించి, ఇక్కడికి కొద్ది మైళ్ళ దిగువన ఉన్న ధవళేశ్వరం దగ్గర రెండు ప్రధాన పాయలుగా చీలి డెల్టాను ఏర్పరుస్తుంది. ఈ పుణ్యస్థలిలో పన్నెండేళ్ళకొకసారి పవిత్ర గోదావరి నది పుష్కరాలు ఘనంగా జరుగుతాయి. ఈ నగరం తూర్పుచాళుక్య రాజైన రాజరాజనరేంద్రుడు పరిపాలించిన చారిత్రక స్థలం, ఆ రాజ్యపు రాజధాని. పూర్వం రాజమహేంద్రవరం, రాజమహేంద్రిగా ఉన్న ఈ నగరి పేరు బ్రిటిష్ వారి హయాంలో రాజమండ్రిగా రూపాంతరం చెందింది. 10.10.2015 నాడు జరిగిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రి మండలి సమావేశంలో రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా తిరిగి మార్చుతూ నిర్ణయంతీసుకుంది. . ఆదికవి నన్నయ ఇక్కడివాడే కనుక ఇది సాహిత్య పరంగా ముఖ్యమైన ఊరు. కందుకూరి వీరేశలింగం ఇక్కడి వాడే కనుక ఈ ఊరు సాంఘికంగా పెద్ద పేరు సంతరించుకొంది.




Impressum