ఎస్టోనియా

Suomi فارسی Tiếng Việt עברית Galego Lietuvių Magyar Nederlands 한국어 Slovenščina Српски / Srpski Norsk (Bokmål) Українська Português Română Français Català Eesti Svenska 日本語 Español Slovenčina 中文 Dansk ไทย Deutsch Euskara Italiano Hrvatski Bahasa Melayu Nynorsk Ελληνικά हिन्दी English Русский Polski Čeština العربية Türkçe

ఎస్టోనియా లేదా ఎస్తోనియా (ఆంగ్లం :Estonia), అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ ఎస్టోనియా. ఉత్తర ఐరోపాకు చెందిన బాల్టిక్ ప్రాంతంలోని ఒక దేశం. దీని ఉత్తర సరిహద్దున ఫిన్‌లాండ్, పశ్చిమ సరిహద్దున స్వీడన్, దక్షిణ సరిహద్దున లాట్వియా (343 కి.మీ) తూర్పు సరిహద్దున రష్యా (338 కిలోమీటర్ల దూరం) దేశాలు ఉన్నాయి.. బాల్టిక్ సముద్రం పశ్చిమతీరంలో స్వీడన్, ఉత్తరాన ఫిన్‌లాండ్ ఉంది. బాల్టిక్ సముద్రంలోని ఎస్టోనియా ప్రధాన భూభాగంతో పాటు 2,222 దీవులను కలిగి ఉంది. దీనిలో భూమి, నీటి వైశాల్యం కలిపి 45,339 చ.కి.మీ. (17,505 చ.కి.మీ.) ఉంది. తేమతో కూడిన ఖండాంతర వాతావరణంతో ప్రభావితమవుతుంది. సంప్రదాయ ఎస్టోనియన్లు ఫిన్నిక్ ప్రజలు, వారి ఉత్తరాన పొరుగున ఉన్నవారితో సాంస్కృతిక సంబంధాలు ఏర్పరుచుకున్నారు.ఎస్టోనియా అనేది ఫిన్యో-ఉగ్రిక్ భాష. ఇది ఫిన్నిష్, సామీ భాషలతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. హంగరీ భాషకి సుదూర సంబంధం కలిగి ఉంటుంది.

Wikipedia



Impressum