పాలకొల్లు

Svenska Nederlands Português Tiếng Việt English Italiano Bahasa Melayu 中文

పాలకొల్లు
Wikipedia

పాలకొల్లు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నగరం. పాలకొల్లు చుట్టుప్రక్కల భూములు సారవంతమైనవి. ఊరిచుట్టూ పచ్చని వరిచేలు, కొబ్బరితోటలు, చేపల చెరువులు కనిపిస్తాయి. పాలకొల్లు నుండి నరసాపురం పట్టణానికి 9 కి.మీ. దూరం. పాలకొల్లుకు 7 కి.మీ. దూరంలో చించినాడ వద్ద వశిష్టగోదావరి నదిపై కట్టిన వంతెన తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలను కలుపుతుంది. పాలకొల్లు పట్టణ మునిసిపాలిటిలో 2020 జనవరి 7లో ఐదు గ్రామ పంచాయతీలలో ఉన్న ఏడు గ్రామాలను పాలకొల్లులో విలీనం చేసారు. పాలకొల్లులో గ్రామాలను విలీనం చేయక ముందు 4.68 కిలోమీటర్ల పరిధిలో 31 వార్డులతో 61,284 (2011 జనాభా లెక్కల ప్రకారం) జనాభా ఉండే వాళ్ళు ప్రస్తుతం 7 గ్రామాల విలీనం చేయడం వలన ఈ ఏడూ గ్రామాల విస్తీర్ణం 20.08 కిలోమీటర్లలో ఉన్న 42,932 జనాభా పాలకొల్లు మునిసిపాలిటి పరిధిలోకి వచ్చారు ప్రస్తుతం పాలకొల్లు మునిసిపాలిటి 7 గ్రామాల విలీనం తరువాత 24.68 కిలోమీటర్ల విస్తీర్ణంలో 35 వార్డులతో 1,04,216 (2011 జనాభా లెక్కల ప్రకారం) జనాభా ఉన్నారు. లక్ష జనాభా దాటడం వలన పాలకొల్లు అమృత్ పదకానికి ఎంపిక కానుంది. పాలకొల్లు మున్సిపాలిటీ ప్రస్తుతం గ్రేడ్ 1 కేటగిరీలో ఉంది విలీనం తర్వాత పాలకొల్లు మున్సిపాలిటీ సెక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా మారనుంది. పాలకొల్లు మునిసిపలిటీలో 100 సంవత్సరాలలో మొదటిసారిగా విలీనం ప్రక్రియ జరిగింది. పశ్చిమగోదావరి జిల్లలో ప్రస్తుతం ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం తరువాత పాలకొల్లు నాల్గవ అతిపెద్ద నగరంగా ఉంది.
Impressum