हिन्दी Nederlands Deutsch English ไทย
చిదంబరం దేవాలయం (తమిళం: சிதம்பரம் கோயில்) పరమశివుడికి అంకితమైన హిందూ దేవాలయం. భారతదేశంలోని దక్షిణ రాష్ట్రమైన తమిళనాడు యొక్క మధ్యస్థ తూర్పు భాగంలోని, కడలూర్ జిల్లాలోని కారైకల్ కి ఉత్తరంగా 60 కిలో మీటర్ల దూరంలో,, పాండిచ్చేరికి దక్షిణంగా 78 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆలయనగరమైన చిదంబరం నడిబొడ్డున ఈ ఆలయం నెలకొని ఉంది. తమిళ సంగం సాహిత్య రచనల ప్రకారం, సనాతన విశ్వకర్మ ల యొక్క వంశస్థుడైన విదువేల్విడుగు పెరుమ్తకన్, ఈ ఆలయం యొక్క పునః సృష్టికి ప్రధాన రూపశిల్పి. ప్రాచీన, పూర్వ-మధ్యస్థ కాలంలో, ప్రత్యేకించి పల్లవ, చోళ రాజుల కాలంలో, ఈ ఆలయంలో పలు నూతన రూపకల్పనలు జరిగాయి.