డెహ్రాడూన్

Suomi فارسی Français Tiếng Việt Lietuvių Bahasa Melayu हिन्दी 日本語 Português Српски / Srpski Español English Română 한국어 中文 Українська Norsk (Bokmål) Polski Magyar Русский العربية Nederlands Čeština Deutsch Italiano Hrvatski Català Türkçe Svenska

డెహ్రాడూన్
Wikipedia

డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని, ఆ రాష్ట్రంలో అతిపెద్ద నగరం. ఇది డెహ్రాడూన్ జిల్లాకు ముఖ్యపట్టణం. ఈ నగరం గఢ్వాల్ ప్రాంతంలో భాగం. గఢ్వాల్ డివిజనల్ కమీషనర్ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది. ఇది ఢిల్లీకి ఉత్తరాన 248 km (154 mi) దూరాన ఏడవ జాతీయ రహదారిపై ఉంది. రైలు మార్గం (డెహ్రాడూన్ రైల్వే స్టేషన్), విమానాశ్రయం (జాలీ గ్రాంట్ విమానాశ్రయం) తోనూ బాగా అనుసంధానించబడి ఉంది. నగర పరిపాలనను డెహ్రాడూన్ మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. ఉత్తరాఖండ్ శాసనసభ శీతాకాల సమావేశాలను ఈ నగరంలో నిర్వహిస్తారు. డెహ్రాడూన్, జాతీయ రాజధాని ప్రాంతం (NCR) చుట్టూ అభివృద్ధి చేస్తున్న అభివృద్ధి వికేంద్రీకరణ ప్రయత్నాల్లో ఒకటి. ఇది ఢిల్లీ మెట్రోపాలిటన్ ప్రాంతం లోకి వలసలను తగ్గించి అక్కడ జనాభా విస్ఫోటనాన్ని తగ్గించడానికీ, హిమాలయాల్లో ఒక స్మార్ట్ సిటీ గానూ ఇది అభివృద్ధి చెందుతోంది.




Impressum