బికానెర్

Suomi فارسی Tiếng Việt Lietuvių Bahasa Melayu Ελληνικά हिन्दी 日本語 Português Español English Русский Română 한국어 Français 中文 Polski Magyar العربية Svenska Nederlands Čeština Deutsch Euskara Українська Српски / Srpski Italiano Norsk (Bokmål) Català Türkçe

బికానెర్
Wikipedia

బికానెర్‌ (ఆంగ్లం: Bikaner) అనేది ఉత్తర భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో వాయువ్య ప్రాంతంలో ఉన్న ఒక జిల్లా. బికానెర్‌ జిల్లా, బికానెర్‌ డివిజన్‌లకు ఈ నగరం పరిపాలన సంబంధిత ప్రధాన కేంద్రం. పూర్వం ఇది బికానెర్ ప్రిన్సియలీ స్టేట్‌కు రాజధాని నగరం. రావ్ బికా, జాట్‌ల ద్వారా ఈ నగరం వెలుగులోకి వచ్చింది. నెహ్రా జాట్‌కు జన్మహక్కుగా ఉన్న ఈ ప్రదేశాన్ని తన రాజధాని కోసం రావ్ బికా ఎంపిక చేశారు. అప్పుడు ఈ ప్రాంతానికి సొంతదారైన నెహ్రా జాట్ తన పేరును ఈ నగరానికి శాశ్వతంగా ఉంచాలనే నిబంధన విధించి రావ్ బికాకు దాన్ని సొంతం చేశాడు. ఈ ప్రాంత సొంతదారుడి పేరైన నైరా లేదా నేరాను రావ్ బికా తన పేరుకు జోడించి ఆ రెండు పేర్ల కలయికతో తాను నిర్మించిన రాజధాని నగరానికి బికానెర్ అని నామకరణం చేశాడు. అలా 1486లో చిన్న మూలాలతో ప్రారంభమైన ఈ నగరం అటుపై రాజస్థాన్‌లో నాల్గవ అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందింది. 1928లో గంగా కాల్వ, 1987లో ఇందిరా గాంధీ కాల్వ పూర్తి కావడంతో ఈ ప్రాంతంలో ఆవాలు, పత్తి, వేరుశెనగ, గోధుమ, కూరగాయలు లాంటి పంటలను సాగుచేసేందుకు అవకాశం ఏర్పడింది. అంతేకాకుండా ఉన్ని ఉత్పత్తితో పాటు జిప్సం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్, బెంటోనైట్ గనుల తవ్వకం లాంటి పరిశ్రమలు కూడా ఇక్కడ అభివృద్ధి చెందాయి.
Impressum