సదుం

English

సదుం
Wikipedia

సదుం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లా, సదుం మండలం లోని గ్రామం.. సదుం అనె ఒక బ్ర్రితిషర్ ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టడం వలన ఈ పేరు వచ్చింది. తక్కువ వర్ష పాత ప్రాంతం అవటం వలన ఇక్కడ మామిడి తోటలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ నివసించే ప్రజలు ఎక్కువగా రైతులు, చిన్న వ్యాపారులు. ఇక్కడ ప్రతి శుక్రవారం సంత జరుగుతుంది. ఇందులో చుట్టుపక్కల ప్రాంతాల నుండి రైతులు పండించిన కూరగాయలు ఇతరాత్ర సరుకులు కొనటం అమ్ముగోలు చేయటం పరిపాటి. ఇక్కడికి దగ్గరలో గొంగివారిపల్లె అనే గ్రామంలో ప్రసిద్ధి గాంచిన పీపల్ గ్రోవే అనే అంతర్జాతీయ పాఠశాల ఉంది. ఈ పాఠశాల ప్రారంభోత్సవంలో మాజీ రాష్ట్రపతి శ్రీ ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ గారు పాల్గొన్నారు.
Impressum