فارسی Français Tiếng Việt Lietuvių Bahasa Melayu हिन्दी 日本語 Português Español English Русский Română 한국어 中文 Norsk (Bokmål) Polski Magyar العربية Nederlands Deutsch Italiano Svenska
కన్యాకుమారి pronunciation (help·info) తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లా లోని ఒక పట్టణం. ఇది భారత ద్వీపకల్పానికి దక్షిణ దిక్కున గల చిట్టచివరి ప్రదేశం లేదా అగ్రం (Cape) . దీనిని కన్యాకుమారి అగ్రం అనికూడా పిలుస్తారు (ఆంగ్లంలో Cape Comorin) . ఇది భారతదేశానికి దక్షిణ దిక్కున గల చిట్టచివరి జిల్లాప్రాంతం. భారతదేశంలోని ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రం. పడమటి కనుమలలో ప్రకృతిసిద్ధమైన ప్రదేశం. మూడు సముద్రాల అరుదైన మేలుకలయిక కన్యాకుమారి ప్రధాన ఆకర్షణ. భారత దేశానికి దక్షిణ సరిహద్దుల్లోని కన్యాకుమారి పవిత్ర యాత్రాస్థలంగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. సముద్ర సోయగాలకు నెలవైన కన్యాకుమారిలో ఉదయాన్నే తన నునులేత కిరణాలతో వెలుగులను ప్రసరింపజేసే సూర్యభగవానుడు, అప్పుడే సముద్ర గర్భం నుంచి ఉద్భవించి పైకి ఎగుస్తున్నాడా అన్నట్లు కనువిందు చేస్తుంటాడు. ముఖ్యంగా పౌర్ణమి రోజు రాత్రిపూట ఏకకాలంలో జరిగే సూర్యాస్తమయం, చంద్రోదయాలను చూసి పులకించని యాత్రికులు ఉండరు.