గ్రీన్‌లాండ్

Suomi فارسی Tiếng Việt Galego Magyar Nederlands Slovenščina Српски / Srpski Norsk (Bokmål) Bahasa Melayu Português Română Français Euskara Català Lietuvių Svenska 日本語 Nynorsk Español Slovenčina 中文 Dansk ไทย Čeština Deutsch Italiano Hrvatski Українська Ελληνικά हिन्दी English Русский 한국어 Eesti Polski العربية Türkçe עברית

గ్రీన్‌లాండ్
Wikipedia

గ్రీన్‌లాండ్ (ఆంగ్లం: Greenland అర్థం "గ్రీన్‌లాండర్ల భూమి") డెన్మార్క్ సామ్రాజ్యపు భాగస్వామ్య దేశం. ఇది ఆర్కిటిక్, అట్లాంటిక్ మహాసముద్రాల మధ్యన గలదు. 1979 లో డెన్మార్క్ స్వాతంత్ర్యాన్ని ప్రసాదించింది. ప్రపంచంలోని అతి పెద్ద దీవి. ఇది కెనడియన్ ద్వీపసమూహానికి తూర్పున ఉంది.ఇది భౌగోళికంగా ఉత్తర అమెరికా ఖండంలో భాగంగా ఉన్నప్పటికీ రాజకీయంగా, సాంస్కృతంగా ఐరోపా ఖండంతో (ప్రత్యేకంగా నార్వే, డెన్మార్క్, కాలనీశక్తులు అలాగే ఒక సహస్రాబ్ధంకంటే అధికంగా ఐస్‌లాండ్) లతో అనుబంధంగా ఉంటుంది. ప్రధానంగా ఈ ప్రాంతంలో సంఖ్యాపరంగా ఆధిక్యతలో ఉన్న " ఇనుయిట్ " ప్రజలు 13 వ శతాబ్దంలో కెనడియన్ ప్రధాన భూభాగం నుండి ఇక్కడకు వలసవచ్చి ద్వీపంతటా విస్తరించారు.ఇది ప్రపంచంలో అతిపెద్ద ద్వీపంగా భావించబడుతుంది. ఆస్ట్రేలియా, అంటార్కిటికా దీనికంటే వైశాల్యపరంగా పెద్ద దేశాలైనా అవి ద్వీపాలుగా కాక ఖండాలుగా గుర్తించబడుతున్నాయి. గ్రీన్లాండ్ నాల్గింట మూడువంతుల భూభాగం శాశ్వత ఐస్ పొరతో కప్పబడి ఉంటుంది.అంటార్కిటికా తరువాత అత్యధికంగా ఐస్ పొరతో నిండిన భూభాగం ఇదే. జనసంఖ్య 56,480 2013 గణాంకాల ఆధారంగా ప్రపంచంలో అత్యల్ప జనసాంధ్రత కలిగిన భూభాగంగా గుర్తించబడుతుంది. జసంఖ్యలో మూడవ భాగం రాజధాని నగరం, అతిపెద్ద నగరం అయిన " నూక్ "లో నివసిస్తున్నారు. " ఆర్కిటిక్ ఉమియాగ్ " ఫెర్రీ సర్వీస్ పశ్చిమ గ్రీన్లాండులోని వివిధ నగరాలను, స్థావరాలను అనుసంధానిస్తుంది.4,500 సంవత్సరాల పూర్వం నుండి గ్రీన్లాండ్ నివాసిత ప్రజల పూర్వీకులు ప్రస్తుత కెనడా నుండి ఇక్కడకు వలసగా వచ్చి స్థిరపడ్డారు.




Impressum