మాచెర్ల

中文 Português Español Tiếng Việt English Bahasa Melayu Svenska Italiano

మాచర్ల, పల్నాడు జిల్లాకు చెందిన పట్టణం, అదేపేరుగల మండలానికి కేంద్రం. ఈ పట్టణంలో హైహవ రాజుల కాలంలో నిర్మించిన చెన్నకేశవస్వామి దేవాలయం ఉంది.పురాతన కాలంలో దీనిని మహాదేవిచర్ల అని పిలిచేవారు. ఇక్కడ జరిగే వార్షిక ఉత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో ఇక్కడికి దూరప్రాంతాాల నుండి యాత్రికులూ, భక్తులూ వస్తుంటారు. ఈ దేవాలయం 12-13 వ శతాబ్దాలలో నిర్మించబడింది. ఈ దేవాలయం ఎదురుగా ఓ పెద్ద ధ్వజస్తంభం చెక్కతో చేయబడి ఇత్తడితో కప్పబడినదై వెలుగొందుతుంది. గుడికి ఎదురుగా నాలుగు స్తంభాల మంటపాలు ఉన్నాయి.

Wikipedia



Impressum