Français हिन्दी 日本語 Deutsch Magyar English Українська Русский Italiano
శ్రీరంగం (తమిళం: ஸ்ரீரங்கம்), శ్రీరంగనాథుడు రంగనాయకి అమ్మవారితో కొలువైవున్న వైష్ణవ దివ్యక్షేత్రం. ఇది తమిళనాడులోని తిరుచిరాపల్లి (తిరుచ్చి) కి ఆనుకొని ఉభయ కావేరీ నదుల మధ్యనున్న పట్టణం. శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయం ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. ఇది వైష్ణవ దివ్యదేశాలలో అత్యంత ప్రధానమైనదిగా భావిస్తారు. ఆళ్వారులు అందరూ ఈ క్షేత్ర మహిమను గానం చేశారు. భారతదేశంలో అతి పెద్ద ఆలయసంకీర్ణాలలో ఒకటి. ఈ ఆలయం ప్రదేశ వైశాల్యం 6,31,000 చదరపు మీటర్లు (156 ఎకరాలు). ప్రాకారం పొడవు 4 కిలోమీటర్లు (10,710 అడుగులు). ప్రపంచంలో అతిపెద్దదైన కంబోడియాలోని అంకార్ వాట్ మందిరం శిథిలావస్థలో ఉన్నది గనుక ప్రపంచంలో పూజాదికాలు జరిగే అతిపెద్ద హిందూ దేవాలయం ఇదేనని దేవాలయం వెబ్‌సైటులో ఉంది. శ్రీరంగం ఆలయ 7 ప్రాకారాలతో, 21 గోపురాలతో విరాజిల్లుతున్నది. ఈ గోపురాన్ని "రాజగోపురం" అంటారు. దీని ఎత్తు 236 అడుగులు (72 మీటర్లు). ఇది ఆసియాలో అతిపెద్ద గోపురం.